ఏపీలో టికెట్ రేట్ ల పెంపు కోసం పుష్పా టీం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. అయినా సరే అప్పటికే స్క్రీన్ షాట్లు అందుబాటులోకి వచ్చేయడంతో ఆ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన ఆమె తొలుత బిజెపిలో ఆక్టివ్ గా ఉండేవారు. తర్వాత టిడిపి ఎంపీ టికెట్ రావడంతో టిడిపిలో జాయిన్ అయిన ఆమె మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు.
RGV : నా న్యూస్, థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలి!!
అల్లు అర్జున్ గారు నంద్యాలలో మీరు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అయింది. కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది. పుష్ప 2 సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలి అంటూ ఆమె వ్యంగంగా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టికెట్ రేట్లు పెంచుతుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది.