టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘‘నిరుద్యోగ మహాధర్నా’’ పేరిట దీక్ష చేపట్టనున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read : WPL 2023 Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్
కానీ.. హైకోర్టు కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. 500 మందితో ధర్నా చేసుకోవచ్చని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. సాయంత్రం 4 గంటలకు ధర్నా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని హైకోర్టు తెలిపింది.
Also Read : Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..
