ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతోంది. యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ గేమ్‌లో గెలిచిన జట్టు టోర్నీ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు నాకౌట్ అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూపీపై ఐదు వికెట్ల తేడాతో నెగ్గి నేరుగా ఫైనల్ చేరింది. దాంతో, నెట్ రన్‌రేటులో వెనకబడిన ముంబై ఫైనల్ బెర్తు కోసం శ్రమిస్తోంది. లీగ్ దశలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ఆరు గేమ్‌లు గెలవగా, అలిస్సా హీలీ జట్టు నాలుగు గెలుపొందింది.
యూపీ వారియర్స్ జట్లులో అలిస్సా హీలీ, శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, సొప్పదండి యశశ్రీ ఉన్నారు. ఇక, ముంబై ఇండియన్స్ లో హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(w), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీతో 26న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. బలమైన ముంబైని రెండో రౌండ్‌లో ఓడించిన యూపీ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటోంది.
కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. లీగ్ దశ ముగిసే సమయానికి ఆజట్టు అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో డీసీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీతో 26న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.