Rain Forecast: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Forecast: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్ విడుదల చేశారు. నేడు, రేపు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈరోజు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Read also: Aviation Industry: పెరుగుతున్న ప్రయాణికులు.. మూతపడుతున్న విమాన సంస్థలు
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 29 నుంచి జూలై 1వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపు నమోదవుతుండగా, అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో గరిష్టం 30.8, కనిష్టంగా 24.5, ఆదిలాబాద్‌లో 34, కనిష్టంగా 24 డిగ్రీలు, భద్రాచలంలో గరిష్టంగా 32.6, కనిష్టంగా 26.5, హనుమకొండలో గరిష్టంగా 32.5, కనిష్టంగా 24.5, ఖమ్మంలో గరిష్టంగా 34.2, కనిష్టంగా 27, మహబూబ్‌నగర్‌లో గరిష్టంగా 31.8, రికార్డు సగటున 25 డిగ్రీలు నమోదయ్యాయి.
World Cup Qualifiers 2023: వన్డే క్రికెట్‌లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!