Heavy Rains: తెలంగాణాలో మళ్లీ వర్షం మొదలైంది. పలు జిల్లాల్లో దంచికొడుతోంది. తాజాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది వర్షం. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెం. మీ, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ మేర వర్షపాతం నమోదయ్యాయి.
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొనింది.