ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా కష్టకాలంలో పని చేస్తూ మరణించిన ఏఎన్ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ని అందించారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లకోమా డే వారోత్సవాల సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు ప్రజలు గ్లకోమా గురించి అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం వుంది. బీపీ ,షుగర్ ఉన్న వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటి బీపీ, షుగర్ ఉన్నవాళ్లలో 3 శాతం ఉంది. సరోజినిదేవి కంటి ఆసుపత్రి పైన త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తానన్నారు మంత్రి హరీష్ రావు.
ప్రపంచంలోనే కంటి వెలుగు లాంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందన్నారు. కేసీఆరే కిట్ ద్వారా ప్రభుత్వ అసుపత్రులలో పెద్ద ఎత్తున డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు. కరోనాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుతంగా పని చేసారని ప్రశంసించారు. అక్కడక్కడ వృత్తిలో ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలను చనిపోయిన వారి కుటుంబాలకు అందించామన్నారు. కంటి వెలుగు ద్వారా కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వంది అన్నారు మంత్రి హరీష్ రావు.