Minister Harish Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణకి అవార్డులే అవార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Speech In Sangareddy Public Meeting: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణకు అవార్డులే అవార్డులు వచ్చాయని.. ఆయన అన్ని భాగాల్లో మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని మంత్రి హరిష్ రావు కొనియాడారు. సంగారెడ్డిలోని పటాన్చెరులో సీఎం కేసీఆర్తో కలిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందని అన్నారు. పటాన్చెరులో దాదాపు రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తున్నామన్నారు. దీంతో.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. వచ్చే ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణం చేసి, అందుబాటులోకి తీసుకోస్తామని పేర్కొన్నారు. పటాన్చెరులో గల్లీగల్లీ తిరిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అని.. ఆయనకు 56 ఇంచుల ఛాతి లేదు కానీ, ఎక్కడ ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు అని వ్యాఖ్యానించారు.
CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
ఆనాడు కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులోని పరిశ్రమలలో పవర్ హాలిడేలు ఉండేవని.. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ కోతలు లేవని హరీష్ రావు పేర్కొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు కరెంట్ లేదు? అని ప్రశ్నించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజి ఇస్తామని మాటిచ్చిన కేసీఆర్.. ఆ హామీని నెరవేర్చారన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో 4 లక్షల ఎకరాలకు నీరు వస్తుందన్నారు. NIMZ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి, జిల్లా యువతకు ఉపాధి కలిస్తామన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో 70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయన్నారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రమే.. 81 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీలు అవుతున్నాయని ఉద్ఘాటించారు. మన పిల్లల చదువులకు ఉక్రెయిన్, రష్యాకి పోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..