Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
- కేసీఆర్ రాజీనామా డిమాండ్‌పై హరీశ్ ఫైర్
- ‘రేవంత్ పిల్ల చేష్టలతో ప్రజలను మభ్యపెట్టలేరు’
- సిద్దిపేట దండయాత్రపై తీవ్ర విమర్శలు
- అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. NTVతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం తన తప్పిదాలు బయటకు రాకుండా ఉండేందుకే కేసీఆర్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రజలు రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలని కోరుతున్నారని, వారి దృష్టిని మరల్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలు చేస్తున్నారని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల దృష్టిని మరల్చలేరని అన్నారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దండయాత్రలు కబ్జా చేయడానికి వస్తారని విమర్శించారు. గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తలకిందులుగా నిలబడినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మరని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని అంశాలపై నిలదీస్తామని హరీశ్ రావు తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి.. వెయ్యి రోజులు గడిచినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. అసెంబ్లీలో 22ఏ అంశంపైనా బీఆర్ఎస్ తరఫున గట్టిగా పోరాడతామని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను సభ వేదికగా ఎండగడతామని తెలిపారు. కేసీఆర్‌పై విమర్శలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు ఫలించవని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!