NTV Telugu Site icon

Harish Rao : కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు

Harish Rao

Harish Rao

మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్‌ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తు్న్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. జిల్లా కు మెడికల్ కాలేజీ వచ్చిందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉందన్నారు. అప్పుడు తాగు నీటి కోసం ఇబ్బంది పడ్డారు మహిళలు.. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి నీరు ఇచ్చామన్నారు. ఛత్తిస్‌ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ ఆడపిల్లల పెళ్ళికి సహాయం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తాగు, సాగు, విద్యుత్, వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి సాధించామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అంత గొప్పగా కేసీఆర్ పాలన అందిస్తున్నారని, హైదారాబాద్ లో బ్యాంకు లను లూటీ చేసిన వాళ్ళు గుండాయిజం చేసినవాళ్లు మంచిర్యాలకు వచ్చారన్నారు మంత్రి హరీష్ రావు.

Also Read : VD 13: రౌడీ హీరో సినిమా షూటింగ్ కి వీసా ప్రాబ్లమ్…

అంతేకాకుండా.. ‘అలాంటి వాళ్ల చేతికి మంచిర్యాల ను అప్పగిస్తే లూటీ చేస్తారు. నేను హాజీ పూర్ అల్లుడీ నే. కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు పెట్టేదే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు నడవవు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీ ఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్ హయాంలో హైదరాబాదులో కర్ఫ్యూలు మతకలహాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ బస్మాసుర హస్తం .దాని నమ్మితే మోసపోతాం. నడ్డా ఇది కేసీఆర్ అడ్డా. రాష్ట్రంలోనే బిజెపిని గెలిపించుకోలే. ఇక్కడ ఏం సాగవు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకో నట కనీసం పరువు అయినా దక్కుతుంది. చేరికల కమిటీ అని ఏసుకున్న అది అట్టర్ ప్లాప్ అయిపోయింది. రాష్ట్రంలో హంగు కాదు బీ ఆర్ఎస్ హైట్రిక్ కొడుతుందని బీఎల్‌ సంతోష్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

Also Read : Oppo A18: మార్కెట్ లోకి మరో ఒప్పో బడ్జెట్‌ ఫోన్‌..తక్కువ ధరకే స్టన్నింగ్ ఫీచర్స్..