మందుల ధరలు పెంపుపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Mamata Banerjee: శ్రీరామ నవమిని జరుపుకోండి.. కానీ ముస్లిం ఏరియాలకు దూరంగా ఉండండి
సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని ఆయన దుయ్యబట్టారు. ఇది అత్యంత బాధాకరమని, దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. ఇదేనా బీజేపీ చెబుతున్న అమృత్ కాల్..?? ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు.
Also Read : World Idli Day: ఇడ్లీనా మజాకా.. గతేడాది 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీల డెలివరీ..