Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
- కరువు మండలాల ప్రకటనపై అభ్యంతరం
- మెదక్ జిల్లాకు అన్యాయం చేశారని ఆరోపణ
- రుణమాఫీ, విద్యుత్ కోతలపై విమర్శలు
- బీరు కంపెనీలకు నీళ్లెలా ఇస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను కూడా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని ఆరోపించారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కరువు మండలాలను ఉద్దేశపూర్వకంగానే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాపై చిన్నచూపు.. వర్షపాతం తక్కువైనా కరువు లేదుట
మెదక్ జిల్లాలో కేవలం ఒక్క మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. ఉదాహరణకు నర్సాపూర్ నియోజకవర్గంలో 27 శాతం, కౌడిపల్లిలో 13 శాతం, చిలిపిచెడ్ మండలంలో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వాటిని కరువు మండలాలుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కరువు మండలాల గుర్తింపు విషయంలో కపట ప్రేమ చూపుతోందని, అసలు కరువు అంచనా కోసం సరైన కమిటీయే వేయలేదని విమర్శించారు. కొడంగల్ అభివృద్ధికి మాత్రం కోట్లాది రూపాయలతో సీఎం శంకుస్థాపనలు చేసుకుంటున్నారని, మెదక్ జిల్లా అంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని మండిపడ్డారు.
Also Read
- DGP CV Anand: "పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం".. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
- SIR Process : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా..?నమోదుకు మళ్లీ అవకాశం ఇచ్చిన ఈసీ
- Bharat Summit in Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ సందడి.. 100 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
- Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
రుణమాఫీ మోసం.. విద్యుత్ కోతలపై నిలదీత
రైతుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సున్నా మార్కులు వేయొచ్చని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ దేవుళ్లపై ఒట్లు వేసి ఘరానా మోసం చేశారని విమర్శించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోనే సుమారు 16 వేల మందికి ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల నిరంతర విద్యుత్ వస్తే.. నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని, రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి ఈ విద్యుత్ కోతలే ప్రధాన కారణమని ఆరోపించారు.
ప్రజల గొంతు తడపడం కంటే బీరు ఫ్యాక్టరీలపైనే ప్రేమ
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సింగూరు ప్రాజెక్టులో తాగునీటి సమస్య తీవ్రమైందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ బీరు కంపెనీలకు మాత్రం దర్జాగా నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో ఇలాంటి కరువు పరిస్థితి వచ్చినప్పుడు సింగూరు నీళ్లను ఉమ్మడి మెదక్ జిల్లా తాగునీటి అవసరాలకే వాడుకున్నామని గుర్తుచేశారు. కానీ నేడు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నీళ్లు వెళ్తున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతలకు సోయి లేదా అని ప్రశ్నించారు. ప్రజల గొంతు తడపడం కంటే బీరు ఫ్యాక్టరీలపైనే ప్రభుత్వానికి ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. సంగారెడ్డిలోని మూడు బీరు కంపెనీలకు ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీళ్లు తరలిస్తున్నారని, మంజీరా నదిలో ఈ కంపెనీలు అక్రమంగా బోర్లు వేస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని హరీశ్ రావు నిలదీశారు.
తాజావార్తలు
-
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!