NTV Telugu Site icon

Harish Rao: కూల్చుతామంటున్న బీజేపీ కావాలా.. నిలబెట్టే కేసీఆర్ కావాలా?

Harish Rao Fires

Harish Rao Fires

Harish Rao Comments On BJP and Congress Party: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ నాలుగేళ్ల పాలనలో ఒక్క రూపాయి పని చేయలేదని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనుల్లో 10 కిలోమీటర్ల పనికిగాను 9 కిలోమీటర్ల 700 మీటర్ల పని పూర్తయింది, మిగిలిన 300 మీటర్ల పనిని 45 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని అన్నారు. హుస్నాబాద్ గడ్డమీద పుట్టిన వాళ్ళు, గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకోరని పిలుపునిచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే చింత అని, కానీ నేడు సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే నిశ్చింత అని వెల్లడించారు.

Telugu Movies: అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సినిమాలు!

దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, తెలంగాణలో రెట్టింపు వృద్ధిరేటు 8 శాతం వుందని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా రైతుబంధు ఇచ్చే రైతుల సంఖ్య రెట్టింపు చేసి ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలకు రైతుల సంఖ్యను తగ్గించి ఇస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు పెంచుతా, కూల్చుత అంటూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిందలు, అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిందలు వేస్తూ కూల్చుతామంటున్న కాంగ్రెస్, బీజేపీలు కావాలో.. నిలబెట్టే కేసీఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. వచ్చే ఉగాదిన గర్భిణుల కోసం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Mimoh Chakraborty: ‘నేనెక్కడున్నా’ అంటున్న మిథున్ తనయుడు!