రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే కుటుంబ పాలనా..? అది కనిపించడం లేదా అంటూ తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరమని విమర్శించారు.
read also: Telangana Congress: మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఆ పార్టీకి సవాల్ గా మారిందా.?
మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమని మండిపడ్డారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్‌ల చేతికి రాష్ట్రం పోయిన తెలంగాణకు నష్టమే అంటూ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ సుభిక్షంగా వుండటానికి గల కారణం కేసీఆర్ ఏ అని తెలిపారు. ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని కొనియాడారు. రేవంత్‌రెడ్డిపై దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Free Bus Ride For Women: ఆ రాష్ట్రంలో సీఎం రక్షాబంధన్ బంపర్ ఆఫర్..