(జూలై 25న యన్టీఆర్ ‘విశ్వరూపం’కు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’. అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు” అన్నిటా నందమూరి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ‘విశ్వరూపం’లో కూడా యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య…