Governor Tamilisai Started Photo and Art Exhibition: తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనె 17వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విమోచన ఉద్యమ ఘట్టాలు, ఉద్యమంలో పాల్గొన్న వారి ఫోటో & ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కేంద్ర ప్రభుత్వ కమ్యునికేషన్ విభాగం ఏర్పాటు చేసింది. ఈ రోజు (సెప్టెంబర్ 14) నుంచి ఈనెల 18 వరకు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్న యోధులను, వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజాం నుండి విమోచనం పొందిన సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోజు విమోచనం కోసం తమ ప్రాణాల్ని త్యజించిన యోధుల్ని స్మరించుకోవాలని చెప్పారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అట్రాసిటీని మర్చిపోలేమని, తెలంగాణ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.
ఇదిలావుండగా.. ఈనెల 17వ తేదీన ఏడాది పాటు జరిగే తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పరేడ్ గ్రౌండ్స్‌లో జోరుగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా అమిత్ షా తెలంగాణ విమోచనం గురించి, అందుకోసం ప్రాణాలు అర్పించిన యోధుల గురించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ కేంద్ర పారామిలిటరీ బలగాలు పరేడ్ గ్రౌండ్స్‌లో రిహార్సల్స్ చేస్తున్నాయి.