Site icon NTV Telugu

Aadi Srinivas: అనవసర రాద్ధాంతం సరికాదు.. కేసీఆర్, కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

New Project (20)

New Project (20)

జయ జయహే తెలంగాణ గీతంపై కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గీతాన్ని ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తే అతన్ని ఆంధ్ర మూలాలున్న వారిగా కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆంధ్రాకు చెందిన వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించినప్పుడు పౌరుషం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

READ MORE: Haircut: హెయిర్ కటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. బార్బర్‌ని లాకప్‌లో పెట్టిన పోలీస్..

కాగా.. మరోవైపు రాష్ట్ర చిహ్నంలో ఉన్న చార్మినార్, కాకతీయ ఆర్చ్ తొలగించడంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. చార్మినార్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర చిహ్నంపై చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార చిహ్నం మార్పును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజముద్రను మారుస్తోందన్నారు.

Exit mobile version