రేపే కోకాపేట భూముల వేలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధమైంది. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం అయ్యింది.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు చేస్తుండగా.. భూముల వేలంపై హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత విజయశాంతి.. ఇక, ఆమె దాఖలు చేసిన పిల్ పై విచారణ చేపట్టింది హైకోర్టు.. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టివేయాలని విజయశాంతి కోరారు.. అయితే, నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున వేలం వేస్తున్నామని కోర్టుకు తెలిపారు ఏజీ.. అయితే, భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంకు ఏర్పాటుపై పూర్తిస్థాయి వాదనలు వింటామని పేర్కొంది..
భూముల వేలాన్ని ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. ఆన్‌లైన్‌లో భూముల వేలాన్ని నిర్వహించనుంది కేంద్రరంగ సంస్థ ఎంఎస్‌టీసీ.. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు. కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ భూముల అమ్మకం ద్వారా 5000 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. కోకాపేటకు చెందిన భూమిని 8ప్లాట్లు చేసింది. ఈ 8 ప్లాట్లలో ఉదయం 4 ప్లాట్లు, మధ్యాహ్నం తర్వాత 4 ప్లాట్లు వేలం వేయనున్నారు. రెండో రోజు ఆన్ లైన్ బిడ్డింగ్ లో టీఎస్ఐఐసీకి చెందిన 30 ఎకరాలు 6 ప్లాట్లు వేలానికి వేయనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!