BC Overseas Education Scheme: తెలంగాణ బీసీ విద్యార్థులకు శుభవార్త.. సెప్టెంబర్ 1 నుంచి విదేశీ విద్యానిధికి దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Overseas Education Scheme: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బీసీ సంక్షేమ శాఖ గురువారం జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు స్కాలర్షిప్ను అందించనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించి 30 వరకు స్వీకరించనున్నారు. ప్రతి ఏడాది బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. ప్రతి ఏడాది రెండు విడతల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులకు అందిస్తున్న విదేజీ విద్యానిధిని.. మరికొన్ని దేశాలకు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Read also: PVR: గదర్ 2 సినిమా కంటే 4 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టిన పీవీఆర్.. రికార్డులన్నీ బద్దలు
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం కింద 2023-24 విద్యాసంవత్సరంలో సెప్టెంబరు(ఫాల్ సీజన్) కాలానికి బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం జారీ చేవారు. దరఖాస్తులను ఈ-పాస్ వెబ్సైట్లో సెప్టెంబరు 1 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్టు తెలిపారు. బీసీ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తు చేసుకోవడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. అభ్యర్థుల వయస్సు 2023 జులై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థుల ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్‌సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్‌సైన్సెస్, హ్యుమానిటీస్ డిగ్రీ కోర్సుల్లో 60 శాతం మార్కులు పొందిన వారు అర్హులని ఉత్తర్వులో స్పష్టం చేశారు. విదేశీ యూనివర్సిటీలో ప్రవేశానికి ఆహ్వానం(ఐ-20) (ఆఫరింట్ లెటర్), వీసా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈ-పాస్ వెబ్సైట్ పొందుపర్చినట్టు ఉత్తర్వులో తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?