KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి స్వాతంత్య్ర ఉద్యమం తరహాలో గొప్ప చరిత్ర ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 1968 నుంచి ప్రారంభమైన ఉద్యమం అనేక దశల్లో కొనసాగిందని.. వేలాది మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని అణచివేసిందని ఆరోపించారు.
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని, 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందని తెలిపారు. పదేళ్లపాటు సాగిన ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారని, కేసీఆర్ పట్టుదల, దీక్ష కారణంగానే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. “సచ్చుడో తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు నడిపారని, ఆ సమయంలో తెలంగాణ సమాజం మొత్తం ఆయన వెనుక నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రూపురేఖలను పూర్తిగా మార్చేశారని చెప్పారు.
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఆర్థిక విప్లవం జరిగిందని, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, వైద్య రంగ అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధికి సమానంగా మరో రాష్ట్రం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ లేదా బీజేపీ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం అసత్యమని ఆయన అన్నారు. అధికారం కోల్పోయినందుకు తమకు బాధ లేదని.. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న ఆకాంక్షలు నెరవేరకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
“రైజింగ్ తెలంగాణ” అంటున్నారు.. కానీ విధానాలు చూస్తే “ఫాలింగ్ తెలంగాణలా” ఉన్నాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా కంటే కాంగ్రెస్ పాలన ప్రమాదకరమని ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరును జపించడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. భూముల వేలం ద్వారా వేల కోట్లు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కంను తెలంగాణలో తీసుకురావాలనే ఆలోచన రైతులకు నష్టదాయకమని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ రంగానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!