Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలు అయ్యాయి. హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్లో ఉదయం సుమారు 8.50 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలను ఘటనాస్థలికి తరలించింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ బేస్మెంట్లో చిక్కుకుపోయిన పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా 37 మందిని బేస్మెంట్ నుంచి రక్షించి, క్యాట్స్ అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. అనంతరం గాయపడిన 11 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 10 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు.
Also Read
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చినప్పటికీ భవనంలో మరెవరైనా చిక్కుకుపోయి ఉన్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, పోలీసులు భవనాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయి? భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
#WATCH | Delhi | Death toll rises to 10 in Malviya Nagar restaurant fire incident, say Delhi Police.
Visuals from the site pic.twitter.com/sfrzsMzJIm
— ANI (@ANI) June 3, 2026
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!