Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Good News For Hyderabad Journalists Supreme Court Gives Green Signal For Allotment And Construction Houses Of Journalists

CJI NV Ramana: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. తీపికబురు చెప్పిన సీజేఐ ఎన్వీ రమణ.. కేటీఆర్‌ హర్షం..

Published Date :August 25, 2022 , 6:24 pm
By Sudhakar Ravula
CJI NV Ramana: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. తీపికబురు చెప్పిన సీజేఐ ఎన్వీ రమణ.. కేటీఆర్‌ హర్షం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎంతో కాలంగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైదరాబాద్‌ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది. పదవి విరమణకు ఒక రోజు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తీపి కబురు చెప్పారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.. అయితే, సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు హైదరాబాద్‌ జర్నలిస్టులు… జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరుగుతుండగా.. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని.. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు.. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? అని ప్రశ్నించారు.. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు..! పవన్, బాబు రహస్య పర్యటనలు ఎందుకు..?

ఇక, హైదరాబాద్‌లో జర్నలిస్టులకు భూమి కేటాయించారు. కానీ, అభివృద్ధి చేయలేదన్నారు సీజేఐ. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్లు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన.. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకునేందుకు తాము అనుమతిస్తున్నామన్నారు.. జర్నలిస్టులు వారి స్థలంలో నిర్మాణాలు జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. మరోవైపు, జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించిన చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ తీర్పు తోడ్పడుతుందని పేర్కొన్న ఆయన.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును క్లీయర్ చేసినందుకు సీజేఐకి సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CJI NV Ramana
  • hyderabad
  • hyderabad journalists
  • journalists
  • ktr

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions