GHMC: నగరంలో రోడ్ల తవ్వకాలపై నిషేధం.. తక్షణమే అమల్లోకి రానున్న ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మధ్యంలో కటింగ్, తవ్వకాలు చేయడాన్ని నిషేధిస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోడ్డు తవ్వడం, కటింగ్ పై నిషేధం విధించింది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం ముగిసే వరకు అక్టోబర్ 31 వరకు నిషేధం అమల్లో ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అత్యవసరంగా రోడ్లు తవ్వాల్సి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి పొందిన తరువాత, తవ్వకం స్థలంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా రోడ్లపై తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన శాఖలు, ఏజెన్సీలు భవిష్యత్తులో రోడ్డు కటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటే విచారణ చేపడతామన్నారు.
Read also: Keerthy Suresh: అతను ఎవరో కనుక్కోవడం మీ వల్ల కాదులే… నేనే చెప్తా
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB), ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSTRANSCO), తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) మరియు కొన్ని ప్రభుత్వ శాఖలు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లను తవ్వుతున్నాయి. ఇక్కడ రోడ్డు కటింగ్‌ను నిలిపివేసి తాత్కాలికంగా ఈసీని పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ ప్రక్రియను మే 31లోగా పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు. వాహనదారులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో రోడ్లను తవ్వడం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచిపోతుంది. కొందరు ప్రమాదవశాత్తు గుంతల్లో పడే ప్రమాదం ఉంది. అలాగే వర్షాకాలంలో రోడ్లపై తవ్వడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు కటింగ్, తవ్వకాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. తాజాగా నగరంలో సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. వర్షాకాలం పూర్తయ్యే వరకు కొత్తగా నిర్మించే భవనాల్లో సెల్లార్ల కోసం తవ్వకాలు చేపట్టవద్దని సూచించారు. అలాగే సెల్లార్లు తవ్వి నిర్మించని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనుమతులు పొందిన తర్వాత సెల్లార్లు నిర్మిస్తున్న చోట తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో సెల్లార్లలోకి నీరు భారీగా చేరుతుంది. దీంతో చాలా మంది సెల్లార్లలో చిక్కుకుపోతున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ చురుగ్గా అడుగులు వేస్తోంది.
New Ration Card: కొత్త రేషన్ కార్డుల జారీ లేనట్లే.. పౌరసరఫరాల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!