GHMC : జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల
- GHMC డీలిమిటేషన్‌కు తుది నోటిఫికేషన్
- డివిజన్లు 150 నుంచి 300కి పెంపు
- జోన్లు 6 నుంచి 12కి విస్తరణ
- కొత్త జోనల్ కమిషనర్ల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా పౌర సేవలను వేగవంతం చేసే ఉద్దేశంతో జిహెచ్ఎంసి డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నూతన సంస్కరణల ప్రకారం భాగ్యనగరంలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
కేవలం డివిజన్ల సంఖ్యనే కాకుండా, పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు , 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజగిరి, శంషాబాద్, గోల్కొండ , రాజేంద్రనగర్ ప్రాంతాలు కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా వార్డు స్థాయి కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు, ప్రస్తుత సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
JC Prabhakar Reddy: ఒక రైతుగా జిల్లా కలెక్టర్‌ను కలిశా.. దీన్ని రాజకీయం చేయొద్దండి
ఈ పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని, ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రజల నుండి సుమారు 6,000కు పైగా అభ్యంతరాలు రాగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతనంగా ఏర్పాటైన 12 జోన్లకు పాలనా సారథులుగా ప్రభుత్వం సమర్థులైన అధికారులను కమిషనర్లుగా నియమించింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవరావు, కూకట్‌పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్‌కు సందీప్ సుల్తానియా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అదేవిధంగా చార్మినార్ జోన్‌కు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, మల్కాజగిరికి సంచిత్ గంగ్వార్, ఎల్బీ నగర్‌కు హేమంత్ కేశవ్ పాటిల్ నియమితులయ్యారు. ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా రాధిక గుప్త, సికింద్రాబాద్‌కు రవికిరణ్ , గోల్కొండ జోన్‌కు ముకుంద రెడ్డిలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్లవాత్మక మార్పుల ద్వారా నగర పాలన నేరుగా ప్రజల ముంగిటకే వెళ్తుందని, మౌలిక సదుపాయాల కల్పన ,ల పరిష్కారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
తాజావార్తలు
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!