TRS vs BJP : బీజేపీకి షాక్.. నలుగురు కాషాయం వీడి గులాబీలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్లోకి చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు.
ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా, మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్లైంది. చేరికల కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!