Hyderabad:‘పుష్ప’ తరహాలో స్మగ్లింగ్.. అరటిపండ్ల చాటున ఎర్ర చందనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్‌కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు.
వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. ఏపీ కడప జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ రఫీ అరిటి పండ్ల వ్యాపారి. ఏపీ, యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ తదితర రాష్ర్టాలకు అరటిపండ్లు సరఫరా చేస్తుంటాడు. కర్నూల్ జిల్లాకు చెందిన ముల్లా బషీర్ అహ్మద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ ప్రాంతంలో నివాసముంటూ అరటిపండ్ల వ్యాపారం చేస్తున్నాడు.
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
ఒకటే వ్యాపారం కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తాము చేస్తున్న వ్యాపారంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎర్ర చందనం వ్యాపారం చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే వీరికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన మూర్తి పరిచయమయ్యాడు. అతడి వద్ద నుంచి లక్ష రూపాయలకు 1500 కిలోల బరువున్న 31 ఎర్ర చందనం దుంగలు కొనుగోలు చేశారు.
వాటిని అరటి పండ్లు సరఫరా చేసే లారీల్లో హైదరాబాద్‌కు తరలించి, మౌలాలిలో దాచిపెట్టారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి బృందం మల్కాజిగిరి పోలీసుల సహకారంతో ఎర్ర చందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ. 1600 నగదు రికవరీ చేశారు. ఎర్రచందనం విలువ సుమారు రూ. 68,16,600 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మూర్తి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!