Illegal Sale Ganja: ఈమె పేరు నీతు.. అమ్మాయి కాదు గంజాయి విక్రయంలో ఆరితేరిన డాన్ లేడీ. సాప్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్ గా గంజాయి విక్రమాలు నిర్వహిస్తు లక్షలు సంపాదించుకునేందుకు ప్లాన్ వేసింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలైంది. నీతు వ్యవహారం చూసి పోలీసులకే షాక్ తిన్నారు. అయితే.. గంజాయి స్మగ్లింగ్‌పై సైబరాబాద్ ఎస్‌వోటీ టీమ్ ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ నగరశివారులోని నానక్‌రామ్ గూడలో ఎస్‌ఓటీ దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో గంజాయి లేడీ డాన్‌ను ఎస్‌వోటీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లేడీ డాన్ నీతుగా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా నీతు గంజాయి విక్రయిస్తోందని వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. ఒక్కరోజుకు సుమారు లక్షల రూపాయల విలువైన గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి విక్రయాలతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని భావించింది నీతు.
Read also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ “ఇస్లామిక్ స్టేట్” పనే..!
పక్కా సమాచారంతో నానక్ రామ్ గూడలోని నీతు ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించగా.. భారీగా గంజాయి, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద మొత్తం 20 కిలోల గంజాయి, 20 లక్షల రూపాయల నగదు లభించినట్లు తెలుస్తోంది. గంజాయి స్మగ్లింగ్‌పై సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా పలు ప్రాంతాల్లో సోదాలు పూర్తి చేసి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం 4.4 కిలోల గంజాయి, ఎల్‌ఎస్‌డీ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎల్‌ఎస్‌డీ, అత్తాపూర్‌లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్‌లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయి, గంజాయి చాక్లెట్లు, నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో 1500 గంజాయి చాక్లెట్లు, పటాన్చెరులో 1960 చాక్లెట్లు, నిజాంపేటలో 114 ఈ-సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Machani Somnath: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాచాని సోమనాథ్..