Seshanna Arrested: సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాజీ నక్సటైట్, గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు మద్దనూరి శేషయ్య అలియాస్ శేషన్న ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ జోయోల్ శేషన్న అరెస్టును అధికారికంగా ప్రకటించారు. శేషన్న బెదిరింపులు, హత్యలకు పాల్పడ్డాడని, అతనిపై ఇప్పటి వరకు 9 కేసులను గుర్తించామన్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడని, కొన్నాళ్ల నుంచి ల్యాండ్ సెటిల్‌మెంట్లు అక్రమ దందాలను చేస్తున్నట్లు తెలియడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు హుమయూన్‌నగర్‌లో ఆయుధాల కేసులో అరెస్టు చేశామని ప్రకటించారు. శేషన్న పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని గోల్కొండ పోలీసులు తెలిపారు. శేషన్న నానక్ రాంగూడ నుండి గచ్చిబౌలి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్నపై వివిధ పోలీస్ స్టేషన్ లలో 9 కేసులు వున్నట్లు తెలిపారు.
Read also: PFI: పీఎఫ్ఐపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల పాటు నిషేధం
1993లో శేషన్నను మొదటిసారి ఆరేస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు. శేషన్న ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులను నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్ స్టార్ నయీంతో కలిసి అనేక నేరాలకు పాల్పడటమే కాకుండా.. నయీంతో కలిసి మావోయిస్ట్ అవతారం, 15 మంది నక్సల్ కమాండర్స్ తో శేషన్న పని చేశాడు. దళం కమాండర్ సుదర్శన్ రెడ్డి తోపాటు నాగన్న, మాధవన్న, మల్లన్న లతో పని చేశాడు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మావోయిస్టులకు కొరియర్ గా, డెన్ కీపర్ గా పని చేశాడు. శేషన్న పై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు వున్నాయని తెలిపారు. శేషన్న పై 6 మర్డర్ కేసులు,3 ఆర్మ్స్ యాక్ట్ కేసులు వున్నాయని, 9 ఎంఎం పిస్టల్, 5 తూటాలు లభించినట్లు వెల్లడించారు పోలీసులు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌లోని చైతన్యనగర్ కాలనీలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.
2016 ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు నయీమ్. ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు చేయాలని ఐటీశాఖ నిర్ణయించింది. ఆస్తులను సీజ్ చేసింది ఐటీ శాఖ మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గతంలోనే ఐటీ శాఖ గుర్తించగా అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్ చేశారు. ఈ పది ఆస్తులు విలువ సుమారు 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఆస్తులు సీజ్ విషయంపై నయీమ్ భార్యకు నోటీసులు ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం