Gangster Ayub Khan Released: ఐదేళ్ల తరువాత విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangster Ayub Khan Released: ఐదేళ్ల చంచల్ గూడ జైల్లోనే విడుదలైన పాతబస్తీ గ్యాంగ్ స్టర్ అయూబ్ ఖాన్ ఇవాళ విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్టు కేసుకు సంబంధించి అరెస్టయిన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ జైలు నుంచి నేడు విడుదలయ్యాడు. గతంలో.. 2017లో సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్‌పోర్టుతో వచ్చాడనే కారణంతో ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులు అయూబ్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.
దీంతో.. అయూబ్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా, సుమారు ఐదేళ్లుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయూబ్‌పై పాతబస్తీ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అయూబ్ ఖాన్ 2010లో హైదరాబాద్‌లోని గోల్కండ చిరునామాతో నకిలీ పాస్‌పోర్టును తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే.. దీనికి సహకరించిన అతడి భార్య హఫీజా బేగం, మరో ఇద్దరు ఖాజీలను కాలాపత్తర్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
అయితే.. అయూబ్ చేసిన నేరాల్లో న్యాయవాది మన్నన్ ఘోరీ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా.. మన్నన్ ఘోరీ ఖరీదు చేసిన ఓ ఇంటికి సంబంధించి అయూబ్ రూ.2.5 లక్షల మామూలు డిమాండ్ చేశాడంతో.. దానికి నిరాకరించడంతో 2002 జూలై 10న తన నలుగురు అనుచరులతో కలసి దారుణంగా హత్య చేశాడు. ఈహత్య కేసులో కింది కోర్టు అయూబ్‌కు జీవితఖైదు విధించింది. ఈనేపథ్యంలో.. మూడేళ్ల జైలు జీవితం అనుభవించిన తర్వాత పైకోర్టు ద్వారా బెయిల్ పొంది 2014 ఏప్రిల్ 11న విడుదలయ్యాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!