వరంగల్లో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్, వంగరి సరస్వతి, దంపతులు.. కాశిబుగ్గ ప్రాంతంలోనే చికెన్ సెంటర్ తో పాటుగా ఫ్యాన్సీ షాపు మ్యారేజ్ బ్యూరో నిర్వహించేవారు. ఈ క్రమంలో వారికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ కిలాడీ దంపతులు అనుకున్నదే తడువుగా నకిలీ నోట్లను ముద్రించి వాటిని రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఈ ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో వున్న స్కానర్తో కూడిన కలర్ ప్రింటర్ తో పాటు, కరెన్సీ అవసరమయిన బాండ్ పేపర్లను కొనుగోలు చేసిన గత మూడు నెలలగా అసలు కరెన్సీకి సంబంధించిన 2 వేలు, ఐదువందలు, రెండువందలు, వంద, యాభై, ఇరువై, పది రూపాయలకు సంబంధించిన కొత్త మరియు పాత నోట్లను ముందుగా స్కానర్తో స్కాన్ చేసిన పిదప స్కాన్ చేసిన నోట్లను కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీని ముద్రించేవారు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ముద్రించిన నకిలీ కరెన్సీని ఎవరికి అనుమానం రానివిధంగా నోట్లను రూపోందించి హన్మకొండ, వరంగల్ లో రద్దీ గా వుండే షాపుల్లో ఈ నకిలీ నోట్లను ఈ కిలాడీ దంపతులు చెలామణీ చేసేవారు.గత కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లుగా పలు ఫిర్యాదులు రావడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మిక తనిఖీ చేయడంతో దంపతులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి నకిలీ కరెన్సీ నోట్ల ముద్రించేందుకుగా వినియోగించే సామగ్రితో పాటు రెండు వేలు 376, ఐదువందలు 204, రెండువందలు 420, వంద 471, యాభై 471, ఇరువై 62, పదిరూపాయలకు సంబంధించి 7 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసారు.
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!