Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్ మారుస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఈసారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రానున్నాయి. సెప్టెంబర్ 19న వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 28న నిమజ్జనం నిర్వహించనున్నారు. అయితే అదే రోజు మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా వచ్చింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అదే రోజు నిమజ్జనం జరగడంతో హిందువులు కూడా వినాయక శోభాయాత్రలు నిర్వహిస్తారు. అయితే రెండు మతాల పండుగలు ఒకే రోజున శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఇరు మతాలకు చెందిన 300 మంది నేతలతో శాంతి కమిటీ (పీస్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది.
Read also: Google vs Teachers: గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సభ్యులు చర్చించారు. రెండు పండుగలు ఒకే రోజు కావడంతో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని వాయిదా వేసేందుకు శాంతి కమిటీ సభ్యులు అంగీకరించారు. విగ్రహాలను ప్రతిష్టించిన 3వ, 6వ మరియు 9వ రోజులలో ఎప్పుడైనా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని హిందూ భక్తులు సూచించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు సూచించారు. ఒకే రోజు రెండు పండుగలు రావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ ఉన్ నబీ ర్యాలీని రద్దు చేస్తూ ఎస్‌యూఎఫ్‌ఐ నిర్ణయం తీసుకుందని అసద్ వెల్లడించారు. ప్రజలు రెండు పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్‌లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!