Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- రక్షణ శాఖ నుంచి అనుమతులు
- మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్
- రాజ్‌నాథ్‌కు సీఎం కృతజ్ఞతలు
- బాపు ఘాట్‌లో పనులకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Sarovar Project : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కీలక అనుమతులు లభించాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాపు ఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సహకరించి, అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ , ఇండియన్ ఆర్మీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మూసీ పునరుజ్జీవనంలో కీలక మైలురాయి
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవనం (మూసీ ప్రక్షాళన), రివర్‌ఫ్రంట్ అభివృద్ధి విజన్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు అనుమతులు రావడం ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. బాపు ఘాట్ పరిసర ప్రాంతాలలో ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావడం వల్ల మూసీ పరివాహక ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యం
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కేవలం ఒక నదిలా కాకుండా.. అద్భుతమైన పర్యావరణ, సాంస్కృతిక , గొప్ప ప్రజా ఆస్తిగా (పబ్లిక్ అసెట్) మార్చడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి ఒక సరికొత్త పర్యాటక హంగులు తోడవుతాయని, పర్యావరణ రక్షణకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్‌తో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!