Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Full Josh In Telangana Bjp With Bjp National Executive Meeting

BJP National Executive Meeting: బీజేపీలో కొత్త జోష్.. తెలంగాణలో కీలక మార్పులు..!

Published Date :July 2, 2022 , 11:28 am
By Sudhakar Ravula
BJP National Executive Meeting: బీజేపీలో కొత్త జోష్.. తెలంగాణలో కీలక మార్పులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్‌ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో.. రాబోయే ఎన్నికలు, దేశంలో ప్రస్తుత పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. శ్రేణులకు అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పదాధికారుల సమావేశంలో చర్చ సాగుతోంది.. ఆ తర్వాత వాటిని ఆమోదించే తీర్మానాలు-అజెండాను ఖరారు చేస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హెచ్‌ఐసీసీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అలాగే మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతాయి. తెలంగాణ నుంచి 14 మందితో సహా దేశం నలుమూలల నుంచి మొత్తం 350 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇక, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యవర్గ సమావేశాల ప్రాంగణం రూపుదిద్దుకుంది. తెలంగాణ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రాంతాలు, వ్యక్తుల పేర్లను ఆయా ప్రాంగణాలకు పెట్టి తెలంగాణ కల్చర్‌ ఉట్టిపడేలా ప్లాన్ చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ ప్రాంతానికి శాతవాహన నగరంగా.. సమావేశ స్థలానికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా… మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్‌ హాల్‌ అని… అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క, సారలమ్మ నిలయంగా పేరు పెట్టారు.

Read Also: BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు

మరోవైపు, కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. దాదాపు 5 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హెచ్‌ఐసీసీ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించి.. నాలుగంచెల భద్రత కల్పించారు. ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ఇక, ఎటూ చూసిన పార్టీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లతో నగరం మొత్తం కాషాయ వర్ణంలోకి మారిపోయింది. కార్యవర్గ సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ.. ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకుంటుందని.. కీలక మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ సిటీకి వస్తున్నారు… రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. రేపు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొంటారు ప్రధాని. ఇవాళ మధ్యాహ్నం 12. 45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరుతారు. 2.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. 3 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి.. 3.20 గంటలకు నోవాటెల్‌కి వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హెచ్‌ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు ప్రధాని మోడీ. రేపు కూడా హైదరాబాద్‌లోనే ఉండనున్న ప్రధాని.. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తరువాత 6 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి 6.30 గంటలకు రోడ్డుమార్గంలో సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు చేరుకుంటారు. ఏడున్నర వరకు సభలోనే ఉండనున్న మోడీ.. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ పూర్తయ్యాక రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.

విజయ సంకల్ప యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. దాదాపు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్‌ చేస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ ఈ సభకు హాజరు కానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని కూర్చునే స్టేజ్‌పైనే 8 మందికి స్థానం కల్పించనున్నారు. ప్రధాని ఉండే ప్రధాన వేదికపైన అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్‌తో పాటు బండి సంజయ్‌, కిషన్ రెడ్డి ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. అందులో భాగాంగానే ఈ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ వేదికగా నిర్వహిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌-బీజేపీ మధ్య వార్‌ నడుస్తోంది. రెండు పార్టీలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రేపటి సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిరేపుతోంది. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో ఎటు చూసిన బీజేపీ శ్రేణుల కోలాహలం, కాషాయమయంతో భాగ్యనగరం సందడిగా మారింది. ఎటూ చూసిన పార్టీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లతో నగరం మొత్తం కాషాయ వర్ణంలోకి మారిపోయింది. కార్యవర్గ సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ.. ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకుంటుందని.. కీలక మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • bjp national executive meeting
  • hyderabad
  • jp nadda

తాజావార్తలు

  • MI Captaincy: “సూర్యను కెప్టెన్ చేయకపోతే హార్దిక్‌కు కష్టాలు తప్పవు”.. దిగ్గజ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు!

  • India Lok Sabha Seats Increase: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?

  • AI+ Nova 2 Ultra 5G: ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఫీచర్‌ తో.. రిలీజ్ కు రెడీ..

  • Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్

  • Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions