Free Entry in Buddhavanam on August 15th due Independence Day Special
భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాయి. అయితే.. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. మరో పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర్య వజ్రోత్సవ ద్వి సప్తాహ పేరిట ఉత్సవాలు చేపడుతోంది. అయితే.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం – బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌లోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుద్ధవనంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులు, సందర్శకులు ఆగస్టు 15న బుద్ధవనంలోని వివిధ విభాగాలను ఉచితంగా సందర్శించే అవకాశాన్ని పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.