Big Breaking: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పొన్నాల రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకి లేఖ రాశారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ అసహనంతో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ పొన్నాల లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో పొన్నాల చేరున్నట్లు సమాచారం. వైఎస్ కేబినెట్ లో నీటిపారుదల మంత్రిగా పొన్నాల పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు.
లేఖలో పొన్నాల..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
బాధతో పార్టీ కి రాజీనామా చేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని అన్నారు. కానీ నన్ను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2018 లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో మేము పరాయి వాళ్ళము అయ్యామని అన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయంకి పాతర పడిందని అన్నారు. బీసీ నాయకుల టికెట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. సర్వేల పేరుతో.. సీట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారని చెప్తున్నారు, పార్టీలో ఉన్న బీసీ నేతలు ఓడిపోయే వాళ్ళు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. నా లాంటి సీనియర్ నేత మాట్లాడాలి అంటే అపోయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని బాధపడ్డారు. బీసీ నేతలు 50 మంది వచ్చి ఏఐసీసీ అపాయింట్ మెంట్ కోరితే.. అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు భూములు.. విల్లాలు ఇస్తే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీని అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. వ్యాపార సంస్థగా పీసీసీ మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ బీసీలకు.. చిన్న చిన్న వర్గాలకు గుర్తింపు ఇస్తుందని, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఇస్తుందని తెలిపారు.
Vicky Kaushal: ఇండియాస్ బెస్ట్ బయోపిక్… టీజర్ కి సెల్యూట్ కొట్టాల్సిందే
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!