B. Vinod Kumar : అమిత్ షా కు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former MP Vinod Kumar Letter To Union Minister Amit Shah.
తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాత అంటే.. 1931 సంవత్సరం తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజ్యసభలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం నాడు అడిగిన ప్రశ్నకు సమాధానం గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది కాబట్టి అది కుదరదని, 2026 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని, అంతకన్నా ముందు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుదల అవకాశం లేదని స్పష్టం చేసిన చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. అయితే జనాభా లెక్కల సవరణ అంశం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని, ఈ లెక్కన 1931 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపాదికన మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉంటుందన్న విషయం స్పష్టమైందని, 2026 సంవత్సరం తర్వాత అనే పదంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాటల్లో తేలిపోయిందని వినోద్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ఒకే దేశం, ఒకే చట్టం అని బిజెపి నినాదాలు ఇస్తోందని, కానీ వాస్తవ రూపంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని, దానికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచకపోవడమే నిదర్శనమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ని సవరించకుండానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం అసెంబ్లీ సీట్లను పెంచిందని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర హోం శాఖ మంత్రి కి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు మరో న్యాయమా అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నీ సవరించడం ద్వారా గాని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాల మేరకు అయినా గాని తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల స్థానాలను పెంచాలని కోరిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!