NTV Telugu Site icon

Sandra Venkata Veeraiah: కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర..

Sandra

Sandra

Sandra Venkata Veeraiah: ఖమ్మం జిల్లా కల్లూరు మండల‌ పరిషత్తు కార్యాలయంలో పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపిపిలకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల కింద ఇంటింటికి తిరిగి చెక్కుతో పాటు చీర పంపిణి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పెళ్ళిళ్ళు కాలేదా.. తులం బంగారం అన్నారు ఏమైంది అని ప్రశ్నించారు. భూమిలేని నిరు పేదల చూట్టే ఈ ప్రభుత్వం తిరుగుతుందని అన్నారు.. భూమి లేని నిరు పేదలకు 15 వేల రూపాయలు ఇస్తామన్నారు.. కౌలు రైతు ఇస్తామన్నారు ఏమైంది.. చివరకు రైతు బంధు ఎత్తెసి ఆ డబ్బులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణామాఫి చేసింది అని సండ్ర వెంకట వీరయ్యా పేర్కొన్నారు.

Read Also: Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటుతుంది అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యా చెప్పుకొచ్చారు. రుణామాఫీ చుట్టూ రాష్ట్రాన్ని తిప్పుతున్నారే తప్ప ఇచ్చిన హమీలు గురించి ఏ ఒక్కరు మాట్లాడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్‌ ప్రకటించారు కానీ ఎన్ని ఖాళీలో ప్రకటించలేదు.. క్క రాష్ట్రం ఏపీలో పెన్షన్లు పెంచారు.. ఇక్కడ పెంచలేదు పైగా రెగ్యులర్ గా పెన్షన్ రావటం లేదన్నారు. అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేను అవమానించారు.. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు.. ఎప్పుడూ చీకటి ఉండదు, ఎప్పుడూ వెలుగు ఉండదు.. వెలుగుకి ఒక్కసారి చీకటి వస్తేనే ఆ వెలుగుకి ఉన్న విలువ తెలుస్తుంది.. మనకి చీకటి వచ్చింది కాబట్టే వెలుగులో ఎంత మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రజలకు అర్దం అవుతుంది అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా తెలిపారు.

Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్

కాగా, మనకి చీకటి రావటం వలన మంచే జరింగదని అందరు భావించాలని సండ్ర వెంకట వీరయ్యా వెల్లడించారు. ఈ చీకటిలోనే మన విలువ ప్రజలకు తెలుస్తుంది.. పార్లమెంటు ఎన్నికల్లో మన ఓట్లు చెక్కు చెదరాయి.. పోలింగ్ తేడాతో కొన్ని బీజేపీ, కొన్ని ఇండిపెండెంట్ కు పడ్డాయి.. తప్ప సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏం పెరగలేదన్నారు. మన మీద వ్యతిరేకత కూడా పోలింగ్ లో తెలిసింది తప్ప మనం ఓడిపోతాం అని అనుకోలేదు.. ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేశారు.. ప్రజలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. మన పరిపాలన లో ఏం లోపాలు జరిగాయి.. ఏం తప్పులు జరిగాయని సమీక్షించుకొని భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల విశ్వాసం చొరగానే విధంగా నడుచుకుందాం అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పుకొచ్చారు.