Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
- ఉద్యోగం పోయిన వెంటనే మోసానికి స్కెచ్
- 9 క్రెడిట్ కార్డుల వివరాలు చోరీ
- 386 లావాదేవీలు.. రూ.1.64 కోట్ల నష్టం
- మాజీ ఉద్యోగిపై సీసీఎస్‌లో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థ ‘అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Acupe Business and Technologies Solutions Pvt Ltd) కంపెనీని నమ్మి పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఏకంగా రూ. 1.64 కోట్ల మేర భారీ మోసానికి పాల్పడ్డాడు. కంపెనీ భాగస్వామ్య సంస్థలకు చెందిన క్రెడిట్ కార్డు వివరాలను అక్రమంగా కాజేసి, వాటి ద్వారా వందలాది లావాదేవీలు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మోసంపై కంపెనీ డైరెక్టర్ చెరుకు అనిరుధ్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్/సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగం తీసేసిన కొద్దిరోజులకే దందా.. అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషబ్ జగ్గీ అనే వ్యక్తి 2025 జనవరిలో ‘అక్యూబ్ బిజినెస్’ కంపెనీలో టికెటింగ్ ఏజెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే అతని పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో మార్చి నెలలోనే కంపెనీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే రిషబ్ సొంతంగా ఒక ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. ఈ క్రమంలో కంపెనీలో పనిచేసే సమయంలో సంపాదించిన భాగస్వామ్య సంస్థల సీనియర్ ప్రతినిధుల 9 క్రెడిట్ కార్డుల సమాచారాన్ని, రహస్య వివరాలను అక్రమంగా వినియోగించడం మొదలుపెట్టాడు.
Also Read
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
386 లావాదేవీలు.. రూ.1.64 కోట్ల నష్టం
సొంత ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న రిషబ్, ఆ నకిలీ క్రెడిట్ కార్డు వివరాలతో ఏకంగా 386 మోసపూరిత లావాదేవీలు జరిపాడు. వీటి ద్వారా 70కి పైగా ఖరీదైన విమాన టికెట్లు బుక్ చేసి, దాదాపు రూ. 1,64,00,000 (కోటి అరవై నాలుగు లక్షలు) మేర కంపెనీకి నిధుల నష్టం చేకూర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు రిషబ్ జగ్గీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు, దర్యాప్తును తీవ్రతరం చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?