Financial Fraud : గత మూడేళ్లలో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నారు. వీటిలో యూపీఐ, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఆర్థిక మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని శుక్రవారం విడుదల చేసిన సర్వే నివేదిక పేర్కొంది.
Credit Card : మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, తరచుగా ప్రజలు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అనేక రకాల చెల్లింపులు చేస్తారు.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. సైబర్ ఫ్రాడ్ పై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్‌ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్‌లను పొందారు.
హైదరాబాద్ దమ్మాయిగూడకి చెందిన నవీన్ గౌడ్ క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి డబ్బులు ఇచ్చేవాడు. హైదరాబాద్ కి చెందిన కొంతమంది యువకులు క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. ఏలాంటి చార్జెస్ లేకుండా.. డబ్బులు ఇవ్వడంతో ఆశపడి లక్షల రూపాయలు కార్డ్స్ పై తీసుకున్నారు.
నకిలీ కాల్ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్ళ వ్యవధిలో 1000 కోట్లు మోసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో ఈ ముఠా కార్యకలాపాలు నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ను టార్గెట్‌గా చేసుకొని బురుడి కొట్టించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. యూకే , ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల క్రెడిట్ కార్డ్ లకు ఇండియా బ్యాంక్‌లు…