Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Foreign Currency Frauds In Nizamabad

Currency Frauds: దీనార్ల పేరిట నిజామాబాద్‌లో నయా దందా

Published Date :May 25, 2022 , 3:31 pm
By NTV WebDesk
Currency Frauds: దీనార్ల పేరిట నిజామాబాద్‌లో నయా దందా
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిజామాబాద్‌ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా అమాయకులకు వలవేసి.. ఆశ పెట్టి మోసం చేస్తున్నారు. బాన్సువాడకు చెందిన ఎజాజ్ అహ్మద్ కు కరెన్సీ కేటుగాళ్ల నుంచి వింత అనుభవం ఎదురైంది. తాడ్పోల్ చౌరస్తాలో ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర మరో స్నేహితుడితో కలిసి కూర్చున్న ఎజాజ్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ముత్తూట్ ఫైనాన్స్ ఎక్కడ అని అడిగాడు వచ్చిన కేటుగాడు. తన పేరు శివకుమార్ గా పరిచయం చేసుకున్నాడు. తనకు అర్జంటుగా ఇండియన్ కరెన్సీ అవసరముందని తన దగ్గర దుబాయ్ దీరమ్స్ ఉన్నాయన్నాడు.

మార్కెట్ లో అయితే వంద దీరమ్స్‌ కి 900 రూపాయలు వస్తాయని ఆశ చూపాడు. తనకు అర్జంటుగా డబ్బు అవవసరం ఉందని ఐదొందలిస్తే వంద దీరమ్ కరెన్సీ ఇచ్చేస్తానన్నాడు. ఆశపడ్డ ఎజాజ్ వెయ్యి రూపాయలిచ్చి.. వందవి రెండు దీరమ్ కరెన్సీలను తీసుకున్నాడు. అనుమానంతో వెంటనే వెళ్లి మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్ లో మార్పిస్తే… శివకుమార్ పేరుతో వచ్చిన కేటుగాడు చెప్పినట్టుగానే… 1900 చొప్పున ఇండియన్ కరెన్సీ దక్కింది. వెయ్యి రూపాయలకు… 2800 రూపాయలదనంగా రావడంతో సంతోషపడ్డాడు ఎజాజ్. కానీ ఇక్కడే గోల్ మాల్ మొదలైంది.

బాన్సువాడలో ఏజాజ్ ఘటన మరువకముందే.. బోధన్ లోనూ ఇదే తరహా మోసం వెలుగు చూసింది. దుబాయ్ దినార్ పేరిట ఘరానా మోసం చేశారు.. కరెన్సీ కేటుగాళ్లు. లక్ష రూపాయల విలువ చేసే దుబాయ్ కరెన్సీ తీసుకుని 50 వేలు ఇండియన్ కరెన్సీ ఇస్తే చాలంటూ.. ఓ యువకునికి కేటుగాళ్లు గాలం వేశారు. వాళ్లు ఇచ్చేవి అసలైన కరెన్సీ అంటూ నమ్మించారు. రెండున్నర లక్షలు ఇండియన్ కరెన్సీ తెచ్చి ఐదులక్షల విలువ చేసే దుబాయ్ కరెన్సీ తీసుకున్నాడు. ఐతే ఇంటికెళ్లి బ్యాగ్ చూసే సరికి షాక్ తిన్నాడు సదరు బాధితుడు. నోట్ల కట్ట పైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టి.. మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి ఘరానా మోసం చేశారు. కరెన్సీ కేటుగాళ్లు.

అత్యాశకు పోయి మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బోధన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. దుబాయ్ దీరమ్స్ పేరిట వచ్చే కేటుగాళ్లను నమ్మవద్దంటూ సూచిస్తున్నారు బోధన్ పోలీసులు. ఆన్ లైన్ మోసాలు చూశాం.. సైబర్ మోసాలను విన్నాం.. కానీ కొందరు కేటుగాళ్లు దుబాయ్ దినార్ పేరిట నయా దందాకు తెరలేపి మోసాలకు పాల్పడుతుండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. ఇలాంటి కరెన్సీ కేటుగాళ్ల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. ఈజీ మనీకి అలవాటుపడితే అసలు మనీకే ఎసరు అని గుర్తించాలి.

YCP : పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేయాలట..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Currency
  • dubai
  • fraudesters
  • india
  • indian currency

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions