Operation Karre Gutta: కర్రెగుట్ట కూంబింగ్ లో బిగ్ ట్విస్ట్..
- కర్రెగుట్ట కూంబింగ్ లో బిగ్ ట్విస్ట్..
- భారీ సొరంగాన్ని గుర్తించిన భద్రతా బలగాలు..
- మావోయిస్టుల ఆచూకీ కోసం గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Karre Gutta: గత ఆరు రోజులుగా కర్రె గుట్టలలో భద్రతా బలగాలు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దు కర్రె గుట్టలలో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. ఈ సొరంగంలో ఒక ప్రాంతం నుంచి మరో మార్గం ద్వారా బయటికి వెళ్లేందుకు వీలుగా ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సొరంగాన్ని స్థావరంగా చేసుకొని మావోయిస్టులు దాడులకు తెగబడ్డారని పేర్కొన్నాయి. అయితే, ఈ సొరంగంలో సరైన గాలి నీరు వాతావరణం ఉంది.. అంతే కాకుండా ఇక్కడ విశాలమైన ప్రాంతం కూడా ఉందన్నారు.ఈ సొరంగంలో 1000 మంది పట్టేంత స్థలం ఉందని అధికారులు వెల్లడించారు..
Read Also: Kaleshwaram ENC Hariram: ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం.. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
కాగా, కర్రెగుట్ట కొండల్లో నక్సలైట్లపై కొనసాగుతున్న ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. ఎండ వేడిమి, 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య శ్రమించి.. ఎట్టకేలకు వారి స్థావరానికి చేరుకోగలిగారు. అయితే భద్రతా దళాలు అక్కడికి చేరుకోకముందే మావోయిస్టులు తమ స్థావరాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇక్కడ వారు ఉన్నట్టు ఆనవాళ్లు దొరికాయి. ఈ గుహలో చాలా రోజుల పాటు వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందవచ్చని చెప్పుకొచ్చారు. ఈ సొరంగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్రీకరించారు.
Read Also: Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?
ఇక, పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఈ కూంబిండ్ ప్రారంభమైనప్పటి నుంచి నక్సలైట్లు ఆహారం, మంచి నీటి కోసం వెంపర్లాడినట్లు తెలుస్తుంది. నక్సలైట్లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి సుమారు 4 నెలల పాటు రేషన్‌తో కర్రెగుట్ట కొండలలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో.. ఆ రేషన్ కూడా వారికి ఉపయోగపడలేదు.. కొండలపై నుంచి దిగితే సైనికుల తూటాలకు బలి అవుతారనీ, భయంతో కొండలపైనే ఎక్కువ కాలం దాక్కుని ఉంటే డీహైడ్రేషన్ వల్ల చనిపోతామనే భయం వారిని వెంటాడుతుంది. మరోవైపు, నక్సలైట్లు దాక్కున్న కొండలను మొత్తం స్వాధీనం చేసుకునే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని భద్రతా దళాలు పట్టుదలతో ఉన్నాయి. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు చొరవ చూపాలంటూ ఇటీవల నక్సలైట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Read Also: BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..
అయితే, మోస్ట్ వాంటేడ్ మావోయిస్టులు కోట్లాది రూపాయల రివార్డు ఉన్న వాళ్లందరు కర్రెగుట్టల్లో తలదాచుకుంటున్నారని భద్రతా దళాలు చెబుతున్నాయి. కాగా, 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకునేందుకు భద్రత బలగాలు హెలికాప్టర్ ను ఉపయోగించి దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే 40 మంది మావోయిస్టు చనిపోయినట్లు సమాచారం వస్తున్నప్పటికీ దానిని ఇప్పటి వరకు భద్రతా బలగాలు అధికారికంగా ధృవీకరించలేదు.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!