Karre Gutta: గత ఆరు రోజులుగా కర్రె గుట్టలలో భద్రతా బలగాలు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దు కర్రె గుట్టలలో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. ఈ సొరంగంలో ఒక ప్రాంతం నుంచి మరో మార్గం ద్వారా బయటికి వెళ్లేందుకు వీలుగా ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి.