వానలు, వరదలు తెలంగాణ వాసుల్ని ముఖ్యంగా భద్రాచలం జనాన్ని వదలడం లేదు. భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. తగ్గినట్లే తగ్గి మళ్ళీ వరద పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్దకు చేరకుంది. దీనితో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పై నుంచి వస్తున్న వరద వల్ల ఈ నెల రోజుల్లో మూడు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చి చేరింది. దీంతో ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్ల మీదకు నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భద్రాచలం నుంచి చర్ల వెంకటాపురం రహదారి మీదికి వరద నీళ్లు భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే రహదారిపై రోడ్లపై వరద నీళ్లు చేరాయి.
మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. గోదావరి నది ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి కోరారు. అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందాలి.24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసు వారి సూచనలు పాటించాలని కోరుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి మరలా ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్న కారణంగా పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు.
Read Also: Kodandaram: ఆయనకు కాంగ్రెస్ తో దోస్తీ కుదిరేనా?
ఈ రోజు రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకోవచ్చని ఇప్పటికే CWC రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు.దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి,ఎం.కాశీనగరం,గంగోలు చర్ల మండలంలోని దండుపేట కాలనీ,వీరాపురం,పెద్దిపల్లి ఆశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర,రామచంద్రాపురం,బట్ట మల్లయ్య గుంపు,కుమ్మరిగూడెం కింది గుంపు,టేకులగుట్ట మణుగూరు మండలంలోని చిన్నరాయిగూడెం,కమలాపురం,అన్నారం గ్రామాల ప్రజలు పోలీసు వారి సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మత్స్యకారులు ఈ సమయంలో నదులలో,చెరువులలో వేటకు వెళ్ళొద్దని కోరారు.నదులు,వాగులు,వంకలను చూడటానికి ప్రజలు,ప్రజా ప్రతినిధులు,పిల్లలు ఎవ్వరూ కూడా రావద్దని విజ్ఞప్తి చేశారు. చర్ల,దుమ్ముగూడెం వెళ్లే రహదారులు జలదిగ్బంధం అవుతున్నాయని వెల్లడించారు.ప్రజలంతా పోలీసువారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Super Vasuki Train: ఆరు ఇంజిన్‌లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!