మనం రోజూ ఆకాశంలో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లు చూస్తుంటాం. కానీ రోడ్డుమీద వెళుతున్న విమానాన్ని మనం చూడడం అరుదు. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యల వల్ల పొలాల్లో, రోడ్లమీద విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ కావడం మనకు తెలుసు. కొన్ని ప్రమాదాల వల్ల కొండల్లో, భారీ సముద్రాల్లో విమానాలు కూలిపోతుంటాయి. కానీ గాల్లో ఎగరాల్సిన విమానం రోడ్డు పైకి రావడం మనం చూశామా? అలా భారీ విమానం రోడ్డు మీదకు వస్తే ఎలా వుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి విమానం ఒకటి కనిపించింది.
రోడ్డు మీదకి వచ్చిన ఈ విహంగాన్ని చూసేందుకు జనం బాగా ఆసక్తి చూపారు.. హైదరాబాదు నుంచి ఢిల్లీకి రెండు లారీల్లో ఓ భారీ విమానాన్ని తరలించారు.. జాతీయ రహదారి మీదుగా ఆదిలాబాద్ జిల్లా గుండా రెండు పెద్ద కంటైనర్లలో విమానం వెళ్లింది. ఈవిమానానికి సంబంధించిన పార్ట్స్ తరలించారు. ఒక వాహనంలో విమానానికి సంబంధించిన బాడీ మొత్తాన్ని తరలించారు. అలాగే, మరొక లారీలో విమానం రెక్కలు ఇతర భాగాలను తరలించారు.
Read ALso: Bigg boss 6: మూడో కెప్టెన్ గా బిగ్ బాస్ రివ్యూవర్!
44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ విమానం లారీలో వెళ్తుండగా దాన్ని జనాలు చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు.. నింగిలో ఎగిరే విమానం నేలపై కొచ్చిందా అంటూ అది చూసిన వాళ్ళు ముచ్చట పడ్డారు.. సేవలు అందించడం ఆపేసాక ఓ వ్యాపారి దీన్ని హోటల్ గా మార్చడం కోసం తీసుకెళ్ళుతున్నట్లుగా వాహనాల డ్రైవర్లు తెలిపారు. విమానంలో హోటల్ ఈ కాన్సెప్ట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం దగ్గర నడుస్తోంది. మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఇప్పుడు ఈ విమానం హోటల్ ఢిల్లీ వాసులకు, పర్యాటకులకు కనువిందు చేయనుందన్నమాట.
Read Also: Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..