Bigg boss 6: మూడో కెప్టెన్ గా బిగ్ బాస్ రివ్యూవర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg boss 6: బిగ్ బాస్ 6 షోలో సినిమా, టీవీ నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ కూ చోటు దక్కింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆదిరెడ్డి. ‘బిగ్ బాస్ షో’ రివ్యూవర్స్ గా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతగా అంటే… చివరకు అదే షో నుండి తనకు ఆహ్వానం అందేంత! చిత్తశుద్థితో ఓ పని చేసుకుంటూ వెళితే ఎప్పుడో కప్పుడు గుర్తింపు ఖచ్చితంగా వస్తుందని ఆదిరెడ్డి నిరూపించాడు. బిగ్ బాస్ హౌస్ లోని ఈ టాలెస్ట్ మెన్ ఇప్పుడు మూడో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ‘అడవిలో ఆట’ అనే గేమ్ ను నిర్వహించారు. మూడు రోజుల పాటు పోలీసులు, దొంగలు, గీతూ లాంటి స్వార్థ వ్యాపారస్థురాలు మధ్య సాగిన రచ్చలో చివరకు కెప్టెన్సీ పోటీలో శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి నిలిచారు. ఈ ముగ్గురిలో ఫైనల్ టాస్క్ లో ఆదిరెడ్డి విజయం సాధించి, ఈ హౌస్ లో మూడో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా అతనితో పాటు బాల్కనీ యాక్సెస్ కు మరో ఇద్దరిని బిగ్ బాస్ ఎంపిక చేసుకోమన్నాడు. అక్కడ తెలివిగా… కంటెస్టెంట్స్ లో ఒకరిగానే పరిగణిస్తున్న రోహిత్-మెరీనాతో పాటు ఆదిరెడ్డి చలాకీ చంటిని ఎంపిక చేసుకున్నాడు.
శుక్రవారం బిగ్ బాస్ హౌస్ లో మరో పేలవమైన పోటీ జరిగింది. అరవై నిమిషాల పాటు ప్రసారం చేసే ఈ కార్యక్రమంలో కనీసం పది నిమిషాలు, ఏడు నిమిషాలు, ఐదు నిమిషాలు, ఒకటిన్నర నిమిషాలు తమని చూపించే ఆస్కారం ఎవరెవరికి ఉందో ఇంటి సభ్యులను చెప్పమని బిగ్ బాస్ కోరాడు. అందులో 10 నిమిషాలు కంటెంట్ లో గీతూ, ఆ తర్వాత కేటగిరిల్లో రేవంత్, ఫైమా, చంటి, వాసంతి వచ్చారు. జీరో ప్రసారం జాబితాలో నిలిచిన కీర్తి భట్, అర్జున్, ఆరోహిలలో ఒకరిని జైలుకు పంపమని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో ఎవరికి వారు తామే జైలుకు వెళతామని పోటీ పడ్డారు. అయితే ఫైనల్ గా తను జైలుకు వెళ్ళడమే కరెక్ట్ అని భావించిన అర్జున్ మిగిలిన ఇద్దరినీ ఒప్పించాడు. శని, ఆదివారాలలో ఎలిమినేషన్ ఉండటంతో నామినేషన్స్ లో ఉన్న వ్యూవర్స్ సానుభూతి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కీర్తి భట్ నీటి కుళాయి ఓపెన్ చేసినట్టుగా కన్నీరు మున్నీరు అవుతుంటే, అర్థరాత్రి కిచెన్ లోనూ, స్టోర్ రూమ్ లోనూ ఆర్జే సూర్య, ఆరోహి స్నేహ పరిమళాలను గుబాళింప చేస్తున్నారు. కుదిరితే కప్పు కాఫీ… వీలైతే కొన్ని చిప్స్ అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం సాగుతోంది. అయితే నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మందిలో శనివారం రేవంత్, బాలాదిత్య, శ్రీహాన్ సేఫ్ జోన్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది!
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!