Triple Talaq Case: 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైనట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసుపై సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన జాస్మీన్ అనే మహిళకు అబ్దుల్ అతిక్‌తో 2017లో వివాహమైందన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది ఫిబ్రవరిలో అబ్దుల్ అతీక్‌పై వేధింపుల కేసు నమోదైందన్నారు.
Read also: Warangal MGM Hospital: దారుణం.. ఫోనులో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సులు.. పాప మృతి
భర్తకు దూరంగా ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేయగా, నెలకు రూ.7 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే అతీక్ కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయలేదు. నాలుగు నెలలుగా భార్యకు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఫోన్ చేసిన లిప్ట్ చేయకుండా నరకయాతన చూపించాడు. ఇలాగే అయితే మళ్లీ నీపై కేసు పెడతానని చెప్పడంతో చివరకు భర్త ఓ నిర్ణయం తీసుకున్నాడు. ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు ఈ నెల 11న వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల నిడివితో మెసేజ్ పంపాడు. ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వాట్సప్ మెసేజ్ భార్య ఫోన్ కు పంపాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అతిక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్ స్పెక్టర్ వివరించారు.
Read also: పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎందుకు బరువు పెరుగుతారు?
కాగా..2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇక సుప్రీంకోర్టు తన తీర్పులో 3:2 మెజారిటీతో ముస్లింలలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకునే ఆచారం చెల్లదని, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. దీంతో ట్రిపుల్ తలాక్ ఖురాన్ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా.. తలాక్-ఏ-బిద్దత్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, పురుషులు తమ భార్యలకు కొన్ని కారణాలతో.. వాట్సాప్ ద్వారా కూడా విడాకులు ఇస్తున్నారని కేంద్రం పేర్కొంది. అయితే త్రిబుల్ తలాక్ చెప్పిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
Pushpa 2 : పుష్ప రాజ్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..?