Site icon NTV Telugu

Fair Accident: రంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి

Fair Accident Rangareddy

Fair Accident Rangareddy

Fair Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలోని కట్టెల గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో ఎగిసి పడుతున్న మంటలకు స్థానికులు బయటకు పరుగులు పెట్టారు. అయితే మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎం.ఎం.పహాడీ వద్ద ఓ కట్టెల గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసి పడుతున్న మంటలు.. దట్టంగా నల్లటి పొగ వ్యాపించాయి. సోఫా తయారీ చేసే షాప్ కు మంటలు అంటుకున్నాయి. రెండు గోదాంలు పూర్తిగా కాళీ బూడిద అయ్యాయి. పరిశ్రమలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పరిశ్రమలో ఉన్న మూడు టూవీలర్స్ దగ్ధమయ్యాయి. మంటలను చూసిన స్థానికులు బయటకు పరుగులు తీసారు. పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో గ్యాస్ సిలిండర్లు పట్టుకొని కుటుంబాలు బయటకు వచ్చింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో.. ఊపిరి ఆడక ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read also: Chennai Encounter: చెన్నైలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీలను కాల్చిచంపిన పోలీసులు!

స్థానికులు కూడా వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేశారు. గత అయిదు గంటలుగా మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కట్టెల గోదాం కావడంతో మంటలు వేగంగా ఎగిసిపడటంతో.. సరవేగంగా మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చలికాలం కావడంతో మంచు కురుస్తోంది. పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి ద్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటునుంచి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. అయితే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
PM Modi : సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. యుద్ధం పై తీవ్ర ఆందోళన

Exit mobile version