Site icon NTV Telugu

Gas Cylinder Blast: హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం..!

Abdullapur Mer Gas Cylinder Blost

Abdullapur Mer Gas Cylinder Blost

Gas Cylinder Blast: భాగ్య నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఓ భవనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలిన సంగతి తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. బయటకు రాగానే ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం చూసి షాక్ తిన్నారు. భవనం నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Read also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని ఘటనా స్థలం నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఒకే ఒక్క వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెను స్థానికులు జాగ్రత్తగా ఇంటికి బయటకు తీసుకువచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీ వాసులంతా భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Bihar: నేడే బిహార్‌ అసెంబ్లీలో నితీశ్ కుమార్‌ ప్రభుత్వానికి బలపరీక్ష..

Exit mobile version