Fire Accident: హైదరాబాద్ లో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. గోశామహల్, రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. భారీగా శబ్దం రావడంతో ప్రజలకు భయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదాలపై హైదరాబాద్ జిల్లా ఫైర్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ..
తెల్లవారు జామున 3:15 నిమిషాలకు రాజేంద్ర నగర్ లోని సన్ సిటీ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందింది అన్నారు. వెంటనే 3 ఫైర్ ఇంజన్ స్పాట్ రిచ్ అయ్యాయని తెలిపారు. ఓ టెన్ట్ హౌస్ గోదాం ఫుట్ పాత్ ఎదుట క్రాకర్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. పక్కనే అనుకొని ఉన్న ఓ ఫుడ్ కోర్టులో సిలిండర్ బ్లాస్ట్ అయిందని తెలిపారు. దీంతో దాని పక్కనే మంటలు అంటుకున్నయన్నారు. మంటలు అంటుకొని ఫుడ్ కోర్టు, హోటల్, పాన్ షాప్,టెన్ట్ హౌస్ గోదాం, మెడికల్ షాప్ , మెడికల్ షాప్ గోదాం లో మంటలు వ్యాపించాయని తెలిపారు. సిలిండర్ బ్లాస్ట్ ఆవ్వడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 5 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ లు, రాజేంద్ర నగర్ పోలీసులు టైంకి రీచ్ అయ్యారని తెలిపారు. 3 గంటల పాటు ఫైర్ ఫైటింగ్ కొనసాగిందని తెలిపారు. పూర్తిగా మంటలు అదుపు చేసామన్నారు. అదృష్ట వశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంఘటనా ఎలా జరిగింది విచారిస్తున్నామని అన్నారు.
రాజేంద్ర అగ్నిప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి సయీద్ మాట్లాడుతూ.. తెల్లవారు జామున పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయన్నారు. మేము అప్పుడు ఏదురుగా ఉన్నామని తెలిపారు. ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణం నుండి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని అన్నారు. వెంటనే 100 దయాళ్ చేసి సమాచారం ఇచ్చామన్నారు. స్థానికులం అందరం కలిసి రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులకు సహాయం చేసామన్నారు. గోదాంలో ఉన్న వారికి అదృష్ట వశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. మరొక బాధితులు మాట్లాడుతూ.. తెల్లవారు జామున 3:15 నిమిషాలకు మెడికల్ షాప్ తగులబడిందని నాకు కాల్ వచ్చింది. నేను వెంటనే వచ్చే సరికి మెడికల్ షాప్ ఇతర షాప్స్ లోకి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయన్నారు. మా మెడికల్ హాల్, గోదాం మొత్తం తగులబడిందన్నారు. టెంట్ హౌస్ ఫుట్ పాత్ పై ఇల్లిగల్ గా క్రాకర్స్ దుకాణం పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. లక్షల్లో అస్తి నష్టం జరిగిందన్నారు. క్రాకర్స్ బిజినెస్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు ఇల్లీగల్ క్రాకర్స్ దుకాణాలపై దృష్టి పెట్టాలని, చర్యలు తీసుకోవాలన్నారు.
Traffic: ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్..