TRS V/s BJP: ఫ్లెక్సీ వార్.. హైదరాబాద్ నుండి జిల్లాలకు పాకింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ శ్రేణులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సరికొత్త పోరు మొదలైంది. దీంతో.. హైదరాబాద్ లో.. ఫ్లెక్సీల వార్ సాగుతుంది. విమర్శలకు ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీలు, కటౌట్ల వార్ వరకు వ్యవహారం వెళ్లింది. ఈనేపథ్యంలో.. ఫ్లెక్సీలు, కటౌట్లతో ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ బీజేపీ మోత మోగిస్తుంటే, దానికి ప్రతిగా తాజాగా మంచిర్యాల జిల్లాలోనూ మోడీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా.. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో సాలు మోదీ.. సంపకు మోడీ హోర్డింగ్‌లు దర్శణమిస్తున్నాయి. ఇక వరంగల్ నగరం ప్రధాన కూడల్లో మోడీకి వ్యతిరేకంగా వెలింది పోస్టర్ల సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు ఆ పోస్టర్లను చింపేసే ప్రయత్నం చేశారు. మోడీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.. చాలు సారు దిగిపో సారు అనే పోస్టర్లు వేసేందుకు బీజేపీ సన్నద్ధం అయ్యింది. దింతో నిన్నటి వరకు హైదరాబాద్ కి పరిమితం అయిన టిఆర్ఎస్.. బీజేపీల పోస్టర్ల గొడవ నేడు వరంగల్ కి పాకింది. ఈనేపథ్యంలో.. ఇరు పార్టీలు ప్రధాన కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టడంతోపాటు సోషల్ మీడియాలోనూ పరస్పర విమర్శల యుద్ధం చేస్తున్నాయి.
అయితే.. నగంరలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ డిజిటల్ కౌంట్ డౌన్‌తో బీజేపీ డిస్ ప్లే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టింది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్టిన డిజిటల్ డిస్ ప్లే బోర్డును అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. అయితే ఈ నేపథ్యంలో.. బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్ఎస్ నేతలు సాలు మోడీ.. సంపకు మోడీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు జిల్లాల్లోనూ వెలుస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఈ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
కాగా.. ఈ ఫ్లెక్సీలపై.. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ట్వీట్ వేదికగా విమర్శలు గుప్తించారు. సాగు చట్టాలు తెచ్చి రైతులను చంపావు’, ‘నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో యువత కడుపు కొట్టావు’, ‘లాక్డౌన్ పేరిట గరీబోళ్లను సంపావు’అనే నినాదాలను ముద్రించారు. అంతేకాకుండా.. నోట్ల రద్దు, రైతుచట్టాలు, నల్లధనం వెనక్కి రప్పించడం తదితర అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ?’అని ప్రశ్నలు పెట్టారు. ఈనేపథ్యంలో.. ఫ్లెక్సీలను ప్రస్తావిస్తూ ‘పరేడ్ గ్రౌండ్‌కు వస్తున్నవు కదా ఈ పోస్టర్లు ఏపియమంటవా మోదీజీ.. ఎనిమిదేళ్లలో మీ పథకాలు ఎంత మందిని చంపాయో కౌంట్ చేద్దామా తరుణ్ చుగ్ ’అని ఎద్దేవా చేశారు.
James Webb Telescope: విశ్వంలోనే లోతైన ఫోటో.. జూలై 12 రిలీజ్
తాజావార్తలు
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?