Tension at Raj Bhavan: రైతు సంఘాలు చేపట్టిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్ సర్కిల్ లో రైతు సంఘాల ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలపై చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్ మోర్చా, సమన్వయ కమిటీ నాయకులు చేపట్టారు. రాజ్‌భవన్ ముట్టడికి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ నేతలు రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
Read also: Harish Rao: దవాఖానల్లో టిఫా స్కానింగ్ మిషన్లు.. ప్రారంభించనున్న హరీశ్ రావు
పోలీసులు ముందుకు వెళ్లేందుకు నిరాకరించేందుకు ఆగ్రహం చెందిన రైతు సంఘాల నేతలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో బైఠాయించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అటవీ సంరక్షణ నిబంధనలు 2022ను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. మెట్రో స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సాగర్, పశ్య పద్మ, పీడబ్ల్యూ సంధ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఆప్రాంతమంతా మిన్నంటాయి.
Woman Stole Necklace : వామ్మో.. ఎంత స్మార్ట్‌గా రూ.10లక్షల నగను దొంగిలించిందో